
D Educt: Oct 1: ప్రవేశాల గడువు పొడిగింపు: హైదరాబాద్లోని డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందేందుకు అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అభ్యర్థులకు మరో అవకాశం: వాస్తవానికి ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30తో ముగియాల్సి ఉండగా, తాజాగా గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమకు ఆసక్తి ఉన్న యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
