
D Spiritual: Apr 23: అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురువారం రోజు ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జోహార్ స్వామి అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు మరియు అర్చక స్వాములు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో చైర్మన్ మరియు సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్వామివారి శేషవస్త్రాలతో చైర్మన్‌ను సత్కరించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. తరువాత స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వెంకటేశ్వరరావు, ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
