
DNews: Dec30:ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, వికలాంగులు, మాజీ సైనికులు మరియు క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన కేసులను హైకోర్టు కొట్టివేసింది.
గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని 2023లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ.. చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ రోస్టర్‌ను అనుసరించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోర్టును కోరారు. విచారణ నిర్వహించిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.
