DSports 31Jan 2026:ముంబై/లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కురిపించిన ప్రశంసలపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించారు. ఆస్ట్రేలియా ‘బీ’ జట్టుపై సాధించిన సాధారణ విజయాన్ని ఏదో ప్రపంచ కప్ గెలిచినంత రేంజ్‌లో పొగుడుతూ ప్రధాని చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

  • లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఇలా రాశారు:”ఆస్ట్రేలియాపై అద్భుతమైన (Electrifying) ప్రదర్శన చేసిన టీమ్ పాకిస్థాన్‌కు అభినందనలు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కృషి అమోఘం. ఇది దేశం గర్వించదగ్గ క్షణం.”
  • పాక్ ప్రధాని చేసిన ఈ ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందిస్తూ వాస్తవాలను గుర్తు చేశారు. ఆయన రియాక్షన్ ఇలా ఉంది:”గౌరవంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇది ఆస్ట్రేలియా ‘బీ’ టీమ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే. ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు (కమిన్స్, మాక్స్‌వెల్, స్టార్క్ వంటి వారు) ఈ జట్టులో లేరు.””170 పరుగుల లక్ష్యమున్న మ్యాచ్‌లో కేవలం 20 పరుగుల తేడాతో గెలవడాన్ని ‘అద్భుతమైన ప్రదర్శన’ అని పిలవలేం.” అని చోప్రా ఎద్దేవా చేశారు.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana