
D Spiritual: Jan 28: తమిళ స్టార్ హీరో ధనుష్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తోమాల సేవలో పాల్గొన్న ధనుష్ తన కుమారులు యాత్ర రాజ్, లింగారాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఎప్పటిలాగే తన సింప్లిసిటీని చాటుకున్న ధనుష్ పంచె కట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో తన కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు వీడియోలు, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
