
DNews: Feb 07: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. ఆయన మాట్లాడుతూ, తనను విమర్శించే ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రేవంత్ తనను “కల్వకుంట్ల కిషన్‌రావు” అని విమర్శించారని, తాను ఎలా కల్వకుంట్ల కిషన్‌రావు అవుతానని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పనికిమాలిన, పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తరచూ నిరాధార ఆరోపణలు చేస్తారని, వాటికి తాను ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఇకపై కేంద్రంపై అనవసరంగా మాట్లాడితే మౌనంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే, ఇంద్రాగాంధీ ఆ జిల్లాకు, తెలంగాణ ప్రజలకు ఏమి చేశారో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మోదీ తన ఎంపీలకు సమాన ప్రాధాన్యం ఇస్తారని కిషన్‌రెడ్డి వివరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరంగా చెబుతానని తెలిపారు.
అంతేకాక, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశంపై ఇంకా స్పష్టత అవసరమని అన్నారు.
