DNews: Jan 31: హైదరాబాద్‌లోని బోడుప్పల్ హరితహారం కాలనీలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం నగరాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య MMTS డౌన్‌లైన్‌లో చోటుచేసుకుంది. మృతులు పిన్నింటి విజయశాంతి రెడ్డి, ఆమె కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి అని పోలీసులు గుర్తించారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు లేదా విలువైన వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. GRP క్రైమ్ నంబర్ 57/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బోడుప్పల్ హరితహారం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana