
DNews: Feb 18: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గ్రేటర్ హైదరాబాద్ పరిశుభ్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భగ్యనగరంలో రోజూ 7,800 టన్నుల చెత్త సేకరించబడుతోందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 4,500 క్లీనింగ్ ఆటోలు ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోందని తెలిపారు. 18,557 మంది శానిటేషన్ సిబ్బంది సేవలు అందిస్తున్నారని, తడి-పొడి చెత్త వేరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు పరిశుభ్రత పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
