
DSports Jan12 2026: భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య రాజకీయ, క్రీడా పరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, మైదానంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వడోదరలో జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ సైకత్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తుండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
- బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించడంతో, దానికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది.భారత్‌లో తమ ప్లేయర్లకు భద్రత లేదని పేర్కొంటూ, ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.తమ అంపైర్లను కూడా భారత్‌కు పంపకూడదని బీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
