ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ గొప్ప పరిపాలన దక్షుడు, తెలంగాణ సాధనకు జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహానీయుడని కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం అన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ 92వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆడిటోరియం ప్రాంగణంలోని బీసీ సెల్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాంచంద్రం మాట్లాడుతూ జయశంకర్‌ ప్రతి ప్రసంగం వాస్తవాలు, గణాంకాలతో కూడినదని, నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్‌ బి.వెంకట్రామిరెడ్డి, కంట్రోలర్‌ కట్ల రాజేందర్‌, పి.కరుణాకర్‌, ఎం.లింగయ్య, పుల్లా శ్రీనివాస్, సంగాల మల్లేశ్వర్‌, ఆర్‌.కృష్ణయ్య, తిరునహరి శేషు, ఈసం నారాయణ, పాలక మండలి సభ్యురాలు అనితారెడ్డి, రమ, చిర్రా రాజు, బి.సురేష్‌లాల్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

By Ramya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana