DNews: Mar 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోయినాబాద్ ఫార్మ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్ట మహేష్ స్టేషన్ బెయిల్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, 2029లో జరగనున్నాయని అంచనా వేశారు. మహిళల రిజర్వేషన్ శాసనసభల్లో త్వరగా అమలైతే తాను ఆనందిస్తానని అన్నారు.
ఇంతకుముందు రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేమ నరేందర్ రెడ్డిని వారికి పరిచయం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్‌తో పాటు ఉన్నారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రోజా పార్లమెంట్‌లో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana