
DNews: Mar 18: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులు మరియు అధికారులకు పెద్ద షాక్ ఇచ్చింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఇప్పటివరకు ఇచ్చే ప్రత్యేక ఇన్‌క్రిమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం RTC బోర్డు తీర్మానం ఆధారంగా తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ఇకపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించినా ప్రత్యేక ఇన్‌క్రిమెంట్ ఇవ్వబడదని స్పష్టంగా తెలిపింది. అయితే, కుటుంబ నియంత్రణ పథకం కింద ఇచ్చే ప్రత్యేక కేజువల్ లీవ్ మాత్రం కొనసాగుతుందని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని RTC యాజమాన్యం ప్రకటించగానే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఈ సౌకర్యాన్ని తొలగించడం అన్యాయమని, మేనేజ్‌మెంట్ తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

