
D Spiritual: Oct 27: మనదేశంలో వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే, చీపురును లక్ష్మిదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల, చీపురును ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు; దానికి ఓ ప్రత్యేక స్థానం కేటాయించుకోవాలి. ఎప్పుడు కూడా యజమానికి చీపురు కనిపించకుండా ఉంచడమే మంచిది. ఈ నియమాలు పాటించకపోతే మనకు నష్టాలే వస్తాయి, కాబట్టి చీపురును జాగ్రత్తగా ఉంచుకోవాలి.
చీపురును ఎప్పుడు కూడా పూజా గదికి సమీపంలో కానీ, తలుపు దగ్గర కానీ ఉంచకూడదు. ఎప్పుడైనా చీపురును ఓ సురక్షితమైన మూలను చూసుకుని అక్కడ పడుకోబెట్టాలి, ఎప్పుడూ నిలబెట్టకూడదు. అలా చేస్తే మనకు వ్యతిరేక ఫలితాలే వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, చీపురును వాడే ఇల్లాళ్లు విరిగినవి, పాడైనవి ఉపయోగించకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మిదేవికి కోపం వస్తుందని తెలుసుకోవాలి.
చీపురు విరిగిపోతే, దాన్ని పారేయాలి. అది కూడా శనివారం రోజు మాత్రమే లేదా అమావాస్య రోజు కూడా పారేయవచ్చు. ఎప్పుడు కూడా చీపురు సక్రమమైనదే వాడుకోవాలి. చీపురు ఎప్పుడు కూడా పాడైపోయిన దాన్ని ఇంటిలో ఉంచుకుంటే దారిద్ర్యమే కలుగుతుంది. అందుకే చీపురును వీలైనంత వరకు బాగున్న దాన్నే ఇంట్లో ఉంచుకోవాలి, లేదంటే దుష్ర్పభావాలు నెలకొంటాయి. ఈ విషయాలు గ్రహించుకుని ఇంట్లో చీపురును జాగ్రత్తగా ఉంచుకుని పాడైపోయిన దాన్ని దూరం చేసుకుంటేనే ఉత్తమం.
