DET:OCT 25:
54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు 2024: విజేతల వివరాలు:
ముఖ్యమైన అవార్డుల ప్రకటన:

54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు 2024 విజేతలను కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెర్రీయన్ ప్రకటించారు. 2023 సంవత్సరంలో విడుదలైన 160 చిత్రాల నుంచి 35 చిత్రాలను తుది రౌండ్‌కు ఎంపిక చేశారు.హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.ఈ పురస్కారాల్లో ‘ఆడుజీవితం’చిత్రం 9 అవార్డులతో సత్తా చాటింది.

ఉత్తమ నటుడు,నటి అవార్డుల విజేతలు:
పురస్కారాలలో నటన విభాగంలో గట్టి పోటీ నెలకొంది.ఈ సారి ఉత్తమ నటుడు అవార్డును పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ చిత్రంలో తన అద్భుత నటనకు గాను అందుకున్నారు.ఇక ఉత్తమ నటి అవార్డును ఊర్వశి ఉళ్లోళుక్కు మరియు బీనా ఆర్.చంద్రన్ తడవు తమ నటనకు గాను పంచుకున్నారు.మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘కాథల్:ది కోర్’చిత్రంలోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు నటన సుధీ కొజికోడ్కు దక్కింది.

ప్రధాన విభాగాలలో విజేతలు:
మమ్ముట్టి నిర్మాణంలో,జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన కాథల్:ది కోర్’చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.ఇక ఆడుజీవితం చిత్రానికి దర్శకత్వం వహించిన బ్లెస్సీ ఉత్తమ దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సౌందర్య విలువలు గల చిత్రంగా కూడా గుర్తింపు పొందింది.మోహన్ లాల్ నటించిన బరోజ్ చిత్రం ఈ అవార్డుల జాబితాలో నామినేషన్లలో ఉందని సమాచారం.

ఇతర ముఖ్య అవార్డులు:
ఉత్తమ సహాయ నటుడు: విజయరాఘవన్ పూక్కాలం.
ఉత్తమ ద్వితీయ చిత్రం : ఇరట్ట
ఉత్తమ కథ: ఆదర్శ్ సుకుమారన్ కాథల్: ది కోర్
ఉత్తమ సంగీత దర్శకుడు నేపథ్య సంగీతం: మాథ్యూస్ పులికన్ కాథల్: ది కోర్
ఆడుజీవితం చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ,ఉత్తమ సౌండ్ మిక్సింగ్,ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ వంటి 9 అవార్డులను గెలుచుకుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana