Skip to content
మార్కెట్ హైలైట్స్ – సెప్టెంబర్ 10, 2025
🔹 దేశీయ మార్కెట్లు:
- ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో ఐటీ, ఎఫ్ఎంసిజి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
- సెన్సెక్స్ 394 పాయింట్లు ఎగిసి 81,181 వద్ద స్థిరపడింది.
- నిఫ్టీ ఇంట్రాడేలో 119 పాయింట్ల లాభంతో 24,892 సంఖ్యను తాకింది.
- ఫార్మా, టెక్ రంగాల షేర్లు కూడా బలంగా కనిపించాయి.
- BSE మిడ్ క్యాప్ 0.22%, స్మాల్ క్యాప్ 0.20% పెరిగాయి.
- అయితే, చమురు & గ్యాస్, రియాల్టీ, ఆటో, విద్యుత్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
🔹 అంతర్జాతీయ మార్కెట్లు:
- జపాన్ నిక్కీ తొలిసారిగా 44,000 దాటి 44,186 వద్ద రికార్డు స్థాయికి చేరింది, లాభాల స్వీకరణతో 43,459 వద్ద స్థిరపడింది.
- హాంగ్ కాంగ్, కొరియా, థాయిలాండ్ మార్కెట్లు 1.5% వరకు లాభపడాయి.
- జర్మనీ DAX 0.50% పడిపోయింది, కానీ ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
- US మార్కెట్లు కూడా స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
🔹 స్టాక్ స్పెషల్ – ఇన్ఫోసిస్:
- ఇన్ఫోసిస్ షేరు 5.18% పెరిగి రూ.1,507 సంఖ్యను తాకింది.
- కంపెనీ 11వ తేదీన షేరు బైబ్యాక్ పరిశీలించనుంది.
- కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లు అయ్యింది.
- సెన్సెక్స్ & నిఫ్టీలో అత్యధిక లాభం సాధించిన స్టాక్.