D Spiritual: Oct 13: హిందూ సంస్కృతిలో దానధర్మాల ప్రాముఖ్యత
సాధారణంగా మన హిందూ సంస్కృతిలో దానధర్మాలకు చాలా ప్రత్యేకత ఉంది. మన హిందూ సంస్కృతి ప్రకారం పేదరికంలో ఉన్న వారికి దానధర్మాలు చేసి ఆదుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి బ్రాహ్మణుల సూచన మేరకు అనేక వస్తువులు దానం చేస్తూ ఉంటారు. ఇలాంటి దానాలలో గోదానం కూడా ఒకటి.

గోదానానికి ఉన్న శుభఫలితాలు
గోదానం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. గోదానం చేయడం వల్ల మన జీవితంలో కలిగే శుభ ఫలితాలు, గోదానం వెనుక గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఔద్దాలకి మహర్షి మరియు నాచికేతుడు కథ
పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. హిందూ శాస్త్రంలో వివరించినట్లు ఆయన తన జీవితాన్ని గడిపేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో ఉన్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించవు. దీంతో తిరిగి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తన తండ్రి దగ్గరకు వెళ్లి చెబుతాడు.

మహర్షి శాపం మరియు నాచికేతుని మరణం
అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి తన యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు. కొడుకు చెప్పిన మాట విని కోపం వచ్చిన ఔద్దాలకి, నాచికేతుని “నరకానికి వెళ్లు” అని శపిస్తాడు. దీంతో నాచికేతుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయితే ఆ తర్వాత తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదిస్తూ గడిపాడు.

నాచికేతుని తిరిగి రావడం
మరుసటి రోజు సూర్యోదయ సమయానికి నాచికేతుడు లేచి తిరిగి రాగానే ఔద్దాలకి పట్తరాని సంతోషం కలిగింది. ఔద్దాల మహర్షి తన కుమారుడికి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపోమని శాపం ఇవ్వలేదు. కనుక నాచికేతుడు నరకానికి వెళ్లినా అతిథిగా పరిగణించబడినట్టు యమధర్మరాజు చెబుతాడు.

యముడు చెప్పిన గోదాన ప్రాముఖ్యత
పుణ్యలోకాలుకు వెళ్లాలంటే ఏం చేయాలో నాచికేతుడు యముడిని అడుగుతాడు. అప్పుడు యముడు చెప్పిన మాట ఏమిటంటే — శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యలోకాలుకు చేరుకోవచ్చని. అయితే గోదానం చేయటానికి ముందు మూడు రాత్రులు నేల మీద నిద్రించాలి, కేవలం నీటిని తాగుతూ దీక్ష చేయాలి. ఆ తరువాత గోదానం చేయాలి. దీంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.

ఇలా గోదానం చేయడం శాస్త్రోక్తంగా అత్యంత పవిత్రమైన దానం అని హిందూ సంస్కృతిలో చెప్పబడింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana