D Spiritual: Oct 12: సాధారణంగా మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు చేతబడి చేయించారా అనే అనుమానం చాలా మందికి కలుగుతుంటుంది. అందుకే చాలామంది వేద పండితులు, స్వామీజీల వద్దకు వెళ్లి జాతకాలు చెప్పించుకోవడం, తాయత్తులు, యంత్రాలు కట్టించుకోవడం వంటివి చేస్తూ వేలకు వేల డబ్బులను నాశనం చేస్తుంటారు.

అయితే, దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా, ఎవరైనా చేతబడి చేసినా మనపై పారకుండా ఉండాలన్నా ఇంట్లో ఉండే కొన్ని పనులు చేయవచ్చు. ముందుగా ఇల్లును శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. పురుటి స్త్రీని విడిగా ఉంచాలి, అలాగే ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి.

అంతేకాకుండా, తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి. ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలను ఉంచుకోవాలి. వీలైతే ప్రతి రోజూ వాటిని పారాయణం చేయాలి. పైన చెప్పిన విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు. అంతేకాకుండా ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana