
హైదరాబాద్‌లోని నారాయణగూడలో త్వరలో నిర్వహించనున్న సదర్ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన దున్నపోతులను శుక్రవారం భోలక్‌పూర్‌లోని సత్తర్‌బాగ్‌లో ప్రదర్శించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమైన దున్నపోతులను ప్రజలకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొని సదర్ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతి ఏడాది యాదవ సమాజం సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దున్నపోతుల అలంకరణ, వాటి ప్రదర్శనలు సదర్ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ నేపథ్యంలో నారాయణగూడలో జరగనున్న సదర్ సంబురాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
