D News: Oct 31: చికెన్‌ ధరలు భారీగా తగ్గింపు.. కిలో రూ.250కే!

తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్‌ ప్రియులకు ఊరట కలిగించేలా చికెన్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.300 వరకు పలికిన చికెన్‌ ధర ప్రస్తుతం రూ.250 స్థాయికి పడిపోయింది. కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్‌ తగ్గిందని, అందువల్లే ధరలు దిగివచ్చాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాన నగరాల్లో చికెన్‌ ధరలు ఇలా..

ప్రాంతాలను బట్టి చికెన్‌ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.252గా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రూ.266గా నమోదైంది. డిమాండ్‌ మరింత తగ్గితే రానున్న రోజుల్లో ధరలు ఇంకాస్త దిగివచ్చే అవకాశం ఉందని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తగ్గిన కోడిగుడ్ల ధరలు.. డజను రూ.80

చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మార్కెట్‌లో డజను గుడ్ల ధర రూ.80కి పడిపోయింది. కార్తీక మాసం నేపథ్యంలో చాలామంది శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో చికెన్‌, గుడ్ల వినియోగం తగ్గిందని, ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *