
D News: Oct 31: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌గ్రాడ్యుయేట్ ఫలితాలు విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బీలు) ఎన్‌టీపీసీ అండర్‌గ్రాడ్యుయేట్ సీబీటీ-2 పరీక్ష ఫలితాలను అక్టోబరు 30న విడుదల చేశాయి. సెప్టెంబరు 17న నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా మొత్తం 3,050 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాల జాబితా, కటాఫ్ మార్కులను పరిశీలించవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నవంబరు 27న టైపింగ్ పరీక్ష
సీబీటీ-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ (సీబీటీఎస్‌టీ) నిర్వహించనున్నారు. ఈ పరీక్షను నవంబరు 27న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
టైపింగ్ పరీక్షతో పాటు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
