D Educt: Oct 30: నిరుద్యోగులకు ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ శిక్షణ

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ ఫ్యూచర్‌ రెడీ స్కిల్లింగ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ (సీఎఫ్‌ఆర్‌ఎస్‌ఐ) కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఫౌండేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ సి. రాఘవేందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఫిట్టర్‌ లేదా ఇతర ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసిన వారికి ఈ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్‌సీవీఈటీ గుర్తింపు పొందిన ఈ కోర్సులో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్‌ (ఎంపీసీ, బైపీసీ), ఫార్మా, ఎంఎల్‌టీ, ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌, డిప్లొమా పూర్తిచేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులని వివరించారు.

ఈ కోర్సు మూడు నెలల పాటు కొనసాగుతుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 8019050334, 9100131017, 8886771981, 9247573293 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *