
D Educt: Oct 27: సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు అక్టోబరు 28తో ముగియనుంది. గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్లో మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు ఇంగ్లిష్లో నిమిషానికి కనీసం 35 పదాల టైపింగ్ వేగం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరి.
అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు అక్టోబరు 28తో ముగియనున్నందున, ఇంకా అప్లై చేయని వారు చివరి తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలి.
దరఖాస్తు విధానం, వయోపరిమితి, ఫీజు, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలను సుప్రీంకోర్టు అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేయడం మంచిది.
