D Educt: Oct 27: థీసిస్‌ లేకుండానే పీహెచ్‌డీ.. ఐఐటీ రోపడ్‌ కొత్త విధానం!

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా సిద్ధాంత వ్యాసం (థీసిస్‌) సమర్పించాల్సిన అవసరం లేకుండా పీహెచ్‌డీ డిగ్రీని అందించే విధానాన్ని పంజాబ్‌లోని ఐఐటీ రోపడ్‌ ప్రవేశపెట్టినట్లు సమాచారం. సంప్రదాయ పరిశోధన పత్రాల కంటే ఆచరణాత్మక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశ్రమలకు ఉపయోగపడే పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

ఈ విధానంలో పరిశోధన విద్యార్థులు పెద్ద పెద్ద థీసిస్‌లు రాయడానికి బదులుగా పరిశ్రమల్లో ఎదురవుతున్న వాస్తవ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించవచ్చు. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పేటెంట్ల సాధన, సాంకేతికత బదిలీ లేదా అంకుర సంస్థల (స్టార్టప్‌ల) స్థాపన వంటి ఆచరణాత్మక ఫలితాల ఆధారంగా పీహెచ్‌డీ డిగ్రీ పొందే అవకాశం కల్పించనున్నారు.

విద్యార్థులు తమ పరిశోధన ద్వారా రూపొందించిన ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడం, స్టార్టప్‌ను ప్రారంభించడం లేదా పేటెంట్‌ పొందడం ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఈ విధానం వల్ల పరిశోధనలను కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా, సమాజానికి మరియు పరిశ్రమలకు ఉపయోగపడే ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చని భావిస్తున్నారు.

ఐఐటీ రోపడ్‌ అసోసియేట్‌ డీన్‌ సారంగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు తమ పరిశోధన ఫలితాలను ఆచరణలో చూపించే స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉత్పత్తిని అభివృద్ధి చేసి, దాని ద్వారా రూ.10 లక్షలు సంపాదించినట్లు నిరూపిస్తే పీహెచ్‌డీ డిగ్రీ పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

ఈ విధానం వల్ల పరిశోధన పత్రాలు, సిద్ధాంత వ్యాసాలను ప్రచురించాలనే ఒత్తిడి తగ్గడంతో పాటు, సమాచారాన్ని తారుమారు చేయడం, కాపీ కొట్టడం వంటి అకడమిక్‌ అక్రమాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. చైనా కూడా ఇటీవల ఆచరణాత్మక పరిశోధనకు ప్రాధాన్యమిచ్చే ఇలాంటి పీహెచ్‌డీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana