
D Educt: Oct 27: పీజీ డెంటల్ ప్రవేశాలు.. తాత్కాలిక అర్హుల జాబితా విడుదల
విజయవాడ: రాష్ట్రంలోని పలు ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో పీజీ డెంటల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాత్కాలిక అర్హుల జాబితాను విడుదల చేసింది.
దిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అక్టోబరు 18న ప్రకటించిన అర్హత శాతాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
తాత్కాలిక జాబితాలో ఏవైనా మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో అక్టోబరు 28లోపు వర్సిటీకి తెలియజేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్. సాయి సుధీర్ సూచించారు.
