D Spiritual: Oct 21: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల కేటాయింపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు సిఫారసు లేఖల ద్వారా దర్శనాలు, గదుల కేటాయింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే మినహాయింపు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకు స్వయంగా తిరుమలకు విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. ఇతరుల ద్వారా వచ్చే సిఫారసు లేఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఈ మార్పులను భక్తులు గమనించాలని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు శ్రీవారి దర్శనం, వసతి కోసం టీటీడీ పాలకమండలి సభ్యులకు, అధికారులకు సిఫారసు లేఖలు తీసుకురావద్దని ప్రజాసంబంధాల విభాగం విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ దేవస్థాన యాజమాన్యానికి సహకరించాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana