D Spiritual: Oct 21: మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామదేవత మంచాలమ్మ ఆలయంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.

అనంతరం సాయంత్రం శ్రీమఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను వెండి అంబారీతో పాటు వెండి, బంగారు, నవరత్న రథాలపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అశేష భక్తజన సందోహం మధ్య శ్రీమఠం ప్రాంగణంలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు బంగారు రథంపై కొలువుదీరిన ప్రహ్లాద రాయలకు మంగళహారతులు సమర్పించి భక్తులను ఆశీర్వదించారు. భక్తుల కోలాహలం మధ్య నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా సాగింది.

ఈ కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్ వెంకటేష్ జోషి, ఎస్కే శ్రీనివాసరావు, ధార్మిక పర్యటన అధికారి శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ నరసింహమూర్తి, పీఆర్వో కార్యాలయ సహాయకుడు రాఘవేంద్ర ఆచార్, వేద పండితులు, అర్చకులు, మఠం సిబ్బంది, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana