D Spiritual: Oct 15: టాలీవుడ్‌ ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పుట్టపర్తిని సందర్శించారు. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట, తాజాగా పుట్టపర్తికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లోనూ పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం అక్టోబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు ఈ జంట వరుసగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దైవాశీస్సులు పొందడం విశేషంగా నిలిచింది.

బ్రిటీష్ పాలన కాలంలో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన తీవ్ర కరువు, ఆకలి చావుల నేపథ్యంలో ‘రణబాలి’ చిత్రాన్ని రూపొందించారు. చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల పోరాటాలను ప్రతిబింబించేలా కథను తీర్చిదిద్దారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.