D Educt: Oct 15: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌ యాజమాన్య కోటా సీట్లలో 72.42 శాతం భర్తీ అయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 1,20,437 బీటెక్‌ సీట్లు ఉండగా, బీ కేటగిరీలోని 34,558 సీట్లకు గాను 25,029 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 9,529 సీట్లు మిగిలిపోయినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

కోర్‌ బ్రాంచీల్లో 4,154 సీట్లు ఉండగా, వాటిలో 2,518 సీట్లు భర్తీ అయ్యాయి. మరోవైపు, సీఎస్‌ఈ, సంబంధిత కోర్సుల్లో మొత్తం 24,968 సీట్లకు గాను 18,588 సీట్లు నిండాయి. ఈ విభాగంలో ఇంకా 6,380 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.