
D Educt: Oct 6: పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ విభాగాలు, ఫ్యాకల్టీల్లో కేటగిరీ-2 కింద నిర్వహించనున్న పీహెచ్డీ ప్రవేశ పరీక్ష-2026కు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ప్రవేశాల డైరెక్టర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియగా, అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. రూ.2,000 ఆలస్య రుసుముతో అక్టోబరు 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
నవంబరు రెండో వారంలో ప్రవేశ పరీక్షలు
పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను నవంబరు రెండో వారంలో నిర్వహించనున్నట్లు ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. పరీక్షకు సంబంధించిన తేదీలు, ఇతర వివరాలను విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించనుంది.
అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లను పరిశీలించాలని అధికారులు సూచించారు.
