Bloody Romeo: Is Preethi Mukundhan Set to Play Nani’s Juliet?

D News : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్, డార్క్ హ్యూమర్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మీనాక్షికి బదులుగా ప్రీతి ముకుందన్?

ఇప్పటివరకు ‘బ్లడీ రోమియో’లో నాని సరసన ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ రేసులోకి తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ పేరు వచ్చినట్లు సమాచారం. సుజీత్ డిజైన్ చేసిన పాత్రకు మీనాక్షి కంటే ప్రీతి అయితే మరింతగా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం ప్రీతి ముకుందన్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్ విషయంలో చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

యూకే బ్యాక్‌డ్రాప్‌లో నాని

‘బ్లడీ రోమియో’ కథ యూకే బ్యాక్‌డ్రాప్‌లో ఫుడ్, గ్యాంగ్‌స్టర్ అంశాల చుట్టూ సాగనున్నట్లు తెలుస్తోంది. నాని ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమాపై నాని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హీరోయిన్ విషయంలో వస్తున్న వార్తలకు మేకర్స్ అధికారికంగా ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రీతి ముకుందన్ నిజంగానే నానికి జోడీగా నటిస్తారా అనేది అధికారిక ప్రకటనతోనే తేలనుంది.

By Avinash