
D Educt: Oct 4: తల్లికి వందనం: 3.29 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల పంపిణీకి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, తాజాగా ఆర్థిక శాఖ కూడా ఫైల్‌కు ఆమోదం తెలిపింది.
3.29 లక్షల మంది తల్లులకు లబ్ధి
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే వచ్చే ఒకటి లేదా రెండు వారాల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
టెక్నికల్ సమస్యలు ఉన్నవారికీ సాయం
గతంలో సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం ఆర్థిక సాయం అందని అర్హులైన తల్లులకు కూడా ఈ విడతలో నిధులు జమ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
