
D Educt: Oct 3: హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రముఖ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (GRCP)లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎం.ఫార్మసీ (కన్వీనర్ కోటా) స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
కళాశాలలో రిపోర్ట్ చేయకుండా మిగిలిన మొత్తం 9 ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఏ కళాశాలలోనూ ప్రవేశం పొందని అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లతో కళాశాలకు రావాలని యాజమాన్యం సూచించింది. అర్హత, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను కళాశాల సూచనల ప్రకారం తెలుసుకుని హాజరు కావాలని పేర్కొంది.
