D Educt: Oct 2: సైకాలజీ, సోషల్ వర్క్, క్రిమినాలజీ విభాగాల్లో విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సైకాలజీ, సోషల్ వర్క్, క్రిమినాలజీ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 15 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు వేతనం లభించనుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్షా విధానం, ఇతర నిబంధనలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.