D News: Oct 1: స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ (LIC GJF) ‘గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026’ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించడమే ఈ స్కాలర్‌షిప్ ప్రధాన ఉద్దేశం.

ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించనున్నారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సును బట్టి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.50,000 వరకు స్కాలర్‌షిప్ అందించే అవకాశం ఉంది.

అర్హత కలిగిన విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని LIC GJF సూచించింది. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన అర్హతలు, నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించి గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.