
D News:ఫహాద్ ఫాజిల్ హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో శశాంక్ ఏలేటి తెరకెక్కించిన **‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’**పై ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ ఈవెంట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.
ఎంట్రీ పాస్‌లకు భారీ డిమాండ్
చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొంటుండటంతో ఆయన అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంట్రీ పాస్‌లకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.
ఫహాద్ ఫాజిల్, శశాంక్ ఏలేటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ వాయిస్ ఓవర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
