D Educt: Sept 29: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2026లో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన 20 అసిస్టెంట్ సైంటిస్ట్, 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్ 24, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.

రోడ్లు, భవనాల శాఖలోని 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు సంబంధించిన పరీక్షలు నవంబర్ 6, 7 తేదీల్లో జరగనున్నాయి.

అలాగే పాఠశాల విద్యాశాఖలోని 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నవంబర్ 12, 13 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది.