The Paradise First Weekend Collections: Nani’s Film Grosses Rs.155 Crore Worldwide

D News : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ తొలి వీకెండ్‌ను పూర్తి చేసుకుంది. విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. చిత్రబృందం వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్‌లో రూ.155 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఆదివారం రూ.19 కోట్లు

వీకెండ్‌లో ఆదివారం రూ.19 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓపెనింగ్ వీకెండ్‌లో ఇదే అత్యల్ప రోజువారీ వసూళ్లు. అయినప్పటికీ తొలి మూడు రోజుల్లో వచ్చిన మొత్తంతో ‘ది ప్యారడైజ్’ మంచి స్థాయిలో వీకెండ్‌ను ముగించింది.

మరోవైపు నార్త్ అమెరికాలో కూడా సినిమా $2 మిలియన్ మార్క్‌ను దాటింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌లో మరో కీలక మైలురాయిని అందుకుంది.

ఇప్పుడు సోమవారం టర్న్

వీకెండ్ పూర్తవడంతో ఇక సినిమా బాక్సాఫీస్ రన్‌కు సోమవారం కలెక్షన్స్ కీలకంగా మారాయి. మిశ్రమ టాక్ మధ్య వసూళ్లలో సినిమా ఎలాంటి స్థిరత్వాన్ని చూపిస్తుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో కాయదు లోహర్, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

By Avinash