Bigg Boss Telugu 10: Unexpected Twist as Mukesh Sacrifices Captaincy to Save Two Contestants

D News : బిగ్ బాస్ తెలుగు 10లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనూహ్య మలుపు తిరిగింది. చివర్లో వర్షిణి, టెంపర్ వంశీ మాత్రమే నామినేషన్‌లో మిగలడంతో వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఖాయమని అంతా భావించారు. కానీ కెప్టెన్ ముఖేష్ తీసుకున్న నిర్ణయంతో ఇద్దరూ సేఫ్ అయ్యారు.

కెప్టెన్సీని త్యాగం చేసిన ముఖేష్

వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ముఖేష్ తన కెప్టెన్సీతో పాటు అధికారాలను వదులుకుంటే.. నామినేషన్స్ రద్దు చేసి వర్షిణి, వంశీ ఇద్దరినీ సేవ్ చేసే అవకాశం ఇచ్చారు.

ఈ ఆఫర్‌పై ముఖేష్ వెంటనే అంగీకరించాడు. తన కెప్టెన్సీని వదులుకుని ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి కాపాడాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ లేకుండానే ప్రక్రియ ముగిసింది. ఇద్దరు సేవ్ కాగా.. ముఖేష్ మాత్రం కెప్టెన్సీని కోల్పోయాడు.

మిథిలేష్ వ్యవహారంపై హౌస్‌లో రచ్చ

ఇదిలా ఉంటే.. ఇప్పటికే రూ.15 లక్షలు తీసుకుని మిథిలేష్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై కొంతమంది కంటెస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేయగా.. త్రిగుణ్, అమన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మరోవైపు రోహిత్ సోదరికి బాబు పుట్టిన విషయాన్ని నాగార్జున చెప్పడంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు. మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ కంటే ఊహించని పరిణామాలే ఎక్కువగా కనిపించాయి. ఇక కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ముఖేష్ ఆట ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

By Avinash