
D News : మలయాళ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంటోని వర్గీస్ హీరోగా నటించిన ‘కాటాలన్’ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్యం
కేరళ–తమిళనాడు అటవీ సరిహద్దుల్లోని ‘ఆనకుల్లి’ గ్రామం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఏనుగుల దాడులతో భయపడుతున్న గ్రామస్తులను మారి అనే వేటగాడు కాపాడతాడు. ఆ తర్వాత అదే గ్రామంపై తన ఆధిపత్యాన్ని పెంచుకుని.. ఏనుగు దంతాల అక్రమ రవాణాతో భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాడు.
మారి సామ్రాజ్యానికి ఎడ్డీ ప్రత్యర్థిగా మారడంతో రెండు వర్గాల మధ్య పోరు మొదలవుతుంది. ఈ ఘర్షణలో అమాయక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ పరిస్థితుల్లో ఆంటోని గ్రామంలోకి అడుగుపెట్టి.. అక్కడి ప్రజల కోసం ఎలా పోరాడాడన్నదే సినిమా కథ.
సునీల్ విలనిజం స్పెషల్
పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్‌తో పాటు సునీల్, దుషారా విజయన్, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ ఇందులో మారి పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించారు.
ఇప్పటికే ‘కాటాలన్’ మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఆహాలోనూ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైనట్లు పలు OTT listings పేర్కొన్నాయి.
యాక్షన్, అడవుల నేపథ్యం, స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్‌లో ఓ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు కొత్త ఆప్షన్‌గా నిలుస్తోంది.
