
D Educt: Sept 26: బీహెచ్‌ఎంఎస్ మెరిట్ జాబితా విడుదల
అఖిల భారత కోటా (ఏఐక్యూ)లో ‘బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్)’ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 25న విడుదల చేసింది. మొత్తం 214 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను వర్సిటీ ప్రకటించింది.
మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 26న సాయంత్రం 4 గంటల్లోపు వర్సిటీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. గడువు అనంతరం వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
ఎండీఎస్ ప్రవేశాలకు రిపోర్టింగ్ గడువు పొడిగింపు
కన్వీనర్ కోటా కింద ఎండీఎస్ ప్రవేశాల్లో భాగంగా ఎంపికైన అభ్యర్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేసే గడువును సెప్టెంబరు 28 వరకు పొడిగించినట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
