Keerthy Suresh’s Dorothy Faces Release Hurdle in Malaysia

D News : కీర్తి సురేశ్ విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డోరతి’. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1990ల గ్రామీణ నేపథ్యంలో స్నేహం, ప్రేమ, సామాజిక విభజనల చుట్టూ ఈ కథ సాగుతుంది.

మలేషియాలో విడుదలకు బ్రేక్

‘డోరతి’లో ఎల్‌జీబీటీక్యూ నేపథ్యాన్ని ప్రస్తావించే సన్నివేశాలు ఉండటంతో మలేషియాలో సినిమా విడుదలకు అనుమతి లభించలేదనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చర్చకు దారితీయడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే మలేషియా విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

టీఐఎఫ్‌ఎఫ్‌లో ప్రత్యేక స్పందన

ఇక ‘డోరతి’ ఇప్పటికే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో పాటు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, నటీనటులపై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. పదేళ్ల తర్వాత టీఐఎఫ్‌ఎఫ్‌లో ప్రదర్శితమైన తమిళ చిత్రంగా కూడా ‘డోరతి’ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

వైవిధ్యమైన కథలను ఎంచుకునే కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాతో మరో కొత్త ప్రయత్నం చేశారు. గతంలో ఈ కథను విజయ్, అజిత్‌లకు కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని తెలిపారు.

By Avinash