D Spiritual: Sept 26: రాయచోటిలో ఘనంగా రాహుకాల పూజలు

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పవిత్ర ఘడియలను పురస్కరించుకుని స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

ముఖ్యంగా మహిళా భక్తులు భారీగా హాజరై స్వామివారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో రాహు-కేతు పూజలు, నోములు నిర్వహించుకున్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం, పూజలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు.