D Spiritual: Sept 24: రిచ్‌మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూకు రూ.1.01 కోట్ల ధర

హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బాలాపూర్ లడ్డూ వేలం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందగా, ఇటీవలి కాలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం కూడా భారీ ధరలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ ఏడాది వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. విల్లాస్ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా వేలం నిర్వహించడంతో లడ్డూ ధర క్రమంగా పెరిగింది. చివరకు శక్తిమాన్ టీమ్ రూ.1.01 కోట్లకు లడ్డూను సొంతం చేసుకుంది.

అయితే గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి లడ్డూ వేలం ధర తగ్గింది. 2024లో రూ.1.87 కోట్లు, 2025లో రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలికిన లడ్డూ.. ఈ ఏడాది రూ.1.01 కోట్లకు చేరుకుంది.

రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్పీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిధులను పలు సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విల్లాస్‌లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్లు, స్థానిక పేద కుటుంబాల పిల్లల విద్యా అవసరాలకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఉచిత వైద్య సహాయం అందించడంతో పాటు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

2018లో కేవలం రూ.25 వేలతో ప్రారంభమైన రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం ఏటా భారీ స్థాయికి చేరుకుంటోంది. భక్తి భావంతో పాటు సామాజిక సేవను మేళవించడంతో ఈ వేలానికి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. పండుగ వేడుకలతో పాటు వేలం ద్వారా సమకూరే నిధులను సమాజ సేవకు వినియోగించడం ద్వారా రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana