
D Educt: Sept 23: నీట్ ఎండీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపు
డెంటల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఎండీఎస్ 2026 రెండో విడత కౌన్సెలింగ్ తుది సీట్ల కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఫలితాలను ప్రకటించింది.
సీట్లు పొందిన అభ్యర్థులు ఎంసీసీ అధికారిక పోర్టల్ నుంచి అలోట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీలోపు కేటాయించిన డెంటల్ కాలేజీల్లో నేరుగా హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంసీసీ సూచించింది.
అవసరమైన ధ్రువపత్రాలు
కాలేజీలో రిపోర్టింగ్ సమయంలో నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, బీడీఎస్ డిగ్రీ, మార్కుల మెమోలు, డీసీఐ/స్టేట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఇంటర్న్‌షిప్ ధ్రువపత్రం, 10వ తరగతి సర్టిఫికెట్, గుర్తింపు కార్డు, సంబంధిత కేటగిరీ సర్టిఫికెట్లను సమర్పించాలి. అసలు ధ్రువపత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను కూడా తీసుకెళ్లాలని ఎంసీసీ స్పష్టం చేసింది.
