
కృష్ణా జలాలను తెలంగాణకు విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా జలాలను తెలంగాణకు విడుదల చేయాలన్న తన విజ్ఞప్తిని అంగీకరించినందుకు డీకే శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు ఈ నిర్ణయం నిదర్శనమని పేర్కొన్నారు. కర్ణాటక తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని ఇది చాటిచెబుతోందని అన్నారు.
దేశ ప్రజల మధ్య ప్రేమ సోదరభావానికి ప్రతీకగా కృష్ణా జలాల విడుదలకు నిర్ణయం తీసుకున్నందుకు డీకే శివకుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు.
