
D News: నందమూరి బాలకృష్ణ చెప్పిన “డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్” డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే డైలాగ్ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఫహాద్ ఫాజిల్ సినిమా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’పై ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది.
బాలయ్య వాయిస్‌తో ట్రైలర్
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌కు నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. మంగళవారం ట్రైలర్ విడుదలకు చిత్రబృందం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. బాలయ్య వాయిస్ ఓవర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
బాలకృష్ణకు ఆర్కా మీడియా వర్క్స్‌తో పాటు నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించేందుకు ఆయన ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫహాద్ ఫాజిల్ మూవీపై అంచనాలు
‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’లో ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
సినిమా ప్రమోషన్స్‌ను విభిన్నంగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఫహాద్ ఫాజిల్ హాజరుకానున్న నేపథ్యంలో.. ఈ సినిమా నుంచి ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
