D Educt: Sept 21: ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్ (AP PGECET) 2026 కౌన్సెలింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు గడువును ఉన్నత విద్యామండలి సెప్టెంబర్ 27, 2026 వరకు పొడిగించింది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ సర్టిఫికేట్ల పరిశీలన సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అలాగే వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు కొనసాగనుంది.

సెప్టెంబర్ 30న నమోదుచేసిన ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం అక్టోబర్ 4న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు.

సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 8 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను గమనించి, నిర్ణీత తేదీల్లోగా ఆయా ప్రక్రియలను పూర్తి చేయాలి.