
D News: Sept 21: పోలీస్, రవాణా, విద్యా శాఖల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామకాల ద్వారా వివిధ శాఖల్లోని కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోలీస్ శాఖలో 36 డీఎస్పీ (సివిల్), 3 డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే విద్యాశాఖలో 14 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈఓ), రవాణా శాఖలో 3 రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ) పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత విభాగాల్లో బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
