D Educt: Sept 21: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3,477 ఖాళీల భర్తీకి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు కొనసాగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.