Unni Mukundan Turns Director With His 50th Film, Teams Up With Panorama Studios

D News: ‘మార్కో’తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నారు. తన కెరీర్‌లో 50వ సినిమాతో రచయితగా, దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ కలిసి నిర్మించనున్నాయి.

హీరోగా.. రైటర్‌గా.. డైరెక్టర్‌గా

ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్-ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే టైటిల్, ఇతర నటీనటులు, షూటింగ్ వివరాలను ఇంకా ప్రకటించలేదు.

నేషనల్ అవార్డు బ్యానర్‌తో చేతులు కలిపిన ఉన్ని

కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నేతృత్వంలోని పనోరమా స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంది. మరోవైపు ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ గతంలో ‘మేప్పడియాన్’ చిత్రాన్ని నిర్మించింది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

‘మార్కో’ తర్వాత పాన్-ఇండియా మార్కెట్‌లో ఉన్ని ముకుందన్‌కు వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు సమాచారం. తన 50వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని, తనదైన శైలిలో కథ చెప్పాలనే కోరికతో దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నానని ఉన్ని ముకుందన్ తెలిపారు.

By Avinash